ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విదేశి విద్యపై తాలిబాన్ నిషేధం
- August 27, 2022
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మహిళలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించారు. తాజాగా విద్యార్థినులపై హుకుం జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ అమ్మాయిలను విదేశాల్లో చదివేందుకు అంగీకరించబోమని, వారు కాబూల్ దాటి వెళ్లరాదని హెచ్చరించారు. అదే సమయంలో అబ్బాయిలు విదేశాల్లో చదవడంపై తాలిబన్లు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వెనుదిరిగిన తర్వాత 2021 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్థాన్ పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసిన తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టారు. వచ్చీ రావడంతోనే తమదైన ముద్ర వేస్తూ మహిళలపై పలు ఆంక్షలు విధించారు. మహిళలు తమ ఇల్లు దాటి వచ్చి పనిచేయడంపై నిషేధాజ్ఞలు ప్రకటించారు. అమ్మాయిలకు ఆరో తరగతి వరకే చదువు, స్కూల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా విద్యాభ్యాసం వంటి నిర్ణయాలతో తామేమీ మారలేదని నిరూపించుకున్నారు. అంతేకాదు, మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే పూర్తిగా కప్పేసేలా దుస్తులు ధరించాలని కూడా స్పష్టం చేశారు. మహిళలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్కుల్లోకి రావడంపైనా నిషేధం ప్రకటించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







