వందే భారత్ రైలు ట్రయల్ రన్..గంటకు 180 కిమీ వేగం

- August 27, 2022 , by Maagulf
వందే భారత్ రైలు ట్రయల్ రన్..గంటకు 180 కిమీ వేగం

న్యూఢిల్లీ: 2019లో తొలి వందేభారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు.ఈ టెస్టులో వందేభారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం విశేషం.భారత్ లో ఇంత వేగంతో దూసుకెళ్లిన రైలు ఇప్పటివరకు లేదు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.కోటా-నాగ్డా సెక్షన్ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.

గంటకు 180 కిమీ వేగంతో వెళుతున్నా రైలు బోగీ అద్దం నిలకడగా ఉందని, ఆ వేగానికి ఎక్కడా అదిరిన దాఖలాలు లేవని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నీళ్లతో ఉన్న గ్లాసు కూడా కనిపిస్తోంది. అందులోని నీరు ఎక్కడా తొణకకపోవడం వందేభారత్ రైలు బోగీల పటిష్ఠతను చాటుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com