ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. BD25 వోచర్ పంపిణీ
- August 30, 2022
బహ్రెయిన్ : ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి వారి స్కూల్ బ్యాగ్, ఇతర ప్రాథమిక సామాగ్రి కోసం BD 25 వోచర్‌ను పంపిణీ చేయాలని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశించారు. విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో తోడ్పాటు అందించడానికి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాల అమలులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ మజిద్ బిన్ అలీ అల్ నోయిమి మాట్లాడుతూ.. విద్యార్థులను సృజనాత్మకత, శ్రేష్ఠతకు ప్రేరేపించే విద్యా వాతావరణాన్ని అందించినందుకు హెచ్‌ఎమ్ ది కింగ్, హెచ్‌ఆర్‌హెచ్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రికి తన అభినందనలు తెలియజేశారు. సెప్టెంబరు 4-6 తేదీలలో ప్రతి పాఠశాలకు షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు తల్లిదండ్రుల కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







