పేపర్‌లెస్ లెర్నింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన సౌదీ

- August 30, 2022 , by Maagulf
పేపర్‌లెస్ లెర్నింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన సౌదీ

సౌదీ: అనేక దశాబ్దాలుగా వాడుకలో ఉన్న సాంప్రదాయ విద్యా వ్యవస్థను సౌదీ అరేబియా రద్దు చేసింది.  మొదటిసారిగా డిజిటలైజేషన్‌కు మార్గం సుగమం చేస్తూ.. రాతపూర్వకంగా పాఠాలు బోధించే పద్ధతిని విద్యా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల కోసం పేపర్ ఆధారిత అభ్యాస సాధనాల తయారీ ఇకపై ఉండదని స్పష్టం చేసింది. ఆదివారం నుంచి ప్రారంభమైన కొత్త విద్యా సంవత్సరంలో రిమోట్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మద్రాసతి (నా పాఠశాల) ద్వారా పేపర్‌లెస్ లెర్నింగ్ సిస్టమ్ అమలు చేయబడుతుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొత్త నిబంధనలను అనుసరించాల్సిందిగా అన్ని మాధ్యమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యా పర్యవేక్షకులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఉపాధ్యాయులు తమ పాఠాలను మెరుగ్గా సిద్ధం చేసుకోవడానికి, ఎలక్ట్రానిక్ పద్ధతిలో వ్యూహాలు, కార్యకలాపాలు, సాధనాలు, మూల్యాంకన ప్రక్రియలను గుర్తించడంలో మద్రాసతి ప్లాట్‌ఫారమ్ ఉపాధ్యాయులకు సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కరోనా సమయంలో మద్రాసతి ప్లాట్‌ఫారమ్ కీలకపాత్ర పోషించిదని, 2020-21 విద్యా సంవత్సరంలోనే దాదాపు ఆరు మిలియన్ల సౌదీ పాఠశాల పిల్లలు ఈ ప్లాట్‌ఫారమ్‌ను సద్వినియోగం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com