జపాన్‌లో మరో భూకంపం కుదిపేసింది..
- April 15, 2016
రిక్టర్‌స్కేల్‌పై 7.2గా తీవ్రత కుమమొటోను మళ్లీ కుదిపేసిన భూకంపం టోక్యో: జపాన్‌లోని కుమమొటో ప్రాంతాన్ని మరో భూకంపం కుదిపేసింది. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతతో శనివారం(స్థానిక సమయం) తెల్లవారుజామున 1.25 గంటలకు భూకంపం దక్షిణ జపాన్‌లోని కుమమొటోలో అలజడి సృష్టించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు అధికారికంగా సమాచారం. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. మరో 760మంది గాయపడ్డారు. పలువురు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అక్కడ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మనిమా సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాల కింద 11మంది చిక్కుకున్నారని, అయితే వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది తెలియటం లేదన్నారు.కాగా మీటరు ఎత్తువరకు సముద్రం ఎగిసిపడి ముందుకు రావచ్చంటూ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీచేసి గంట అనంతరం ఉపసంహరించుకుంది. తాము ఇళ్లల్లో చిక్కుపోయామని పలువురు మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. భూకంపం తర్వాత అనేక చిన్నపాటి ప్రకంపనలొచ్చాయి. 'మషికి' పట్టణంలో భారీ సంఖ్యలో అత్యవసర వాహనాల శబ్దాలు వినిపించాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం వివరాలు తెలియరాలేదు. మషికి పట్టణంలోని టౌన్‌హాలు బయట రోడ్డుకు భారీ పగులు ఏర్పడింది. పలువురు బిల్డింగుల్లో చిక్కుకుని సాయం కోసం అర్థించారు. తాజా భూకంప కేంద్రం మొన్నటి భూకంప కేంద్రానికి ఆగ్నేయంలో 12 కి.మి దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూమికి 10కిలోమీటర్లలోతులో ఇది ఉంది. గురువారం కుమమొటోలో భూకంప సంభవించి 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







