మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా.? ప్రూఫ్ ఇదిగో.!

- September 05, 2022 , by Maagulf
మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా.? ప్రూఫ్ ఇదిగో.!

మంచు మనోజ్ రెండో పెళ్లిపై గత కొంత కాలంగా సోషల్ కోడి తెగ కూత పెడుతోంది. అయితే, నిజంగానే మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా.? అంటే, కొన్ని ఆధారాలు నిజమే అనిపిస్తున్నాయ్. కానీ, ఈ వార్తలపై మనోజ్ ఏమంటున్నాడో తెలుసా.? 
‘అది పూర్తిగా నా పర్సనల్.. సందర్భం వస్తే ఖచ్చితంగా చెప్తా..’ అంటూ మాట దాటేశాడు మంచు మనోజ్.భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల రెండో కుమార్తై భూమా మోనికను మంచు మనోజ్ గత కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. దాంతో, ఆ నోటా ఈ నోటా ఈ విషయం పాకి, రూమర్‌గా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
తాజాగా వినాయక చవితి సందర్భంగా ఓ మండపం వద్ద భూమా మోనికతో కలిసి వినాయకుడిని దర్శించుకుంటూ కెమెరాకి చిక్కాడు మంచు మనోజ్. అక్కడే మీడియా మనోజ్‌ని ఈ విషయంపై ప్రశ్నించగా, అది నా పర్సనల్ అంటూ జస్ట్ ఎస్కేప్ అయిపోయాడు మంచు మనోజ్. మరి నిజంగానే మంచు మనోజ్, భూమా మోనికను పెళ్లి చేసుకోబోతున్నాడా.? ఇంకా కొన్ని రోజులు ఆగితే కానీ, ఆ విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు.
ఇక, సినిమాల విషయానికి వస్తే, మంచు మనోజ్ గత కొంత కాలంగా యాక్టింగ్‌కి దూరంగా వుంటున్నాడు. ఇటీవలే ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా అనౌన్స్ చేశాడు మంచు మనోజ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com