గ్రాండ్‌గా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ సీజన్ 6: ‘ఆట’ మొదలైంది.!

- September 05, 2022 , by Maagulf
గ్రాండ్‌గా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ సీజన్ 6: ‘ఆట’ మొదలైంది.!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఈ సారి బిగ్ హౌస్‌ని మరింత బ్యూటిఫుల్‌గా ఆకర్షణగా తీర్చి దిద్దారు. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, గార్డెన్ ప్లేస్.. ఇలా అన్నీ కలర్ ఫుల్‌గా డిజైన్ చేశారు.
నాగార్జున మరియు ఛీర్ గాళ్స్‌తో ఈ సారి బిగ్ హౌస్‌ని కాస్త కొత్తగా పరిచయం చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ సాంగ్ టెలికాస్ట్ అవుతుండగా, అందుకు అనుగుణంగా నాగార్జున ఛీర్ గాళ్స్‌తో స్టెప్పులేస్తూ బిగ్ హౌస్‌ని వర్ణించారు.
ఈ కాన్సెప్ట్ వీక్షకుల్ని మెప్పించింది. గత సీజన్ సెన్సేషన్ అయిన సిరి హన్మంత్ లవర్ శ్రీహాన్, సుదీప అలియాస్ పింకి, యాంకర్ నేహా రెడ్డి, చలాకీ చంటీ, బాలాదిత్య, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, సింగర్ రేవంత్ తదితరులు తప్ప మిగిలిన ముఖాలు పెద్దగా తెలిసినవి కావు. మొత్తం 20 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం ‘ఆట’ మొదలైంది. 
ఇక నాగార్జున కంటెస్టెంట్లతో చేసిన ఓవర్ యాక్టింగ్ మామూలే. సినిమాల్లో ఎలా వున్నా పట్టించుకోరు కానీ, బిగ్‌బాస్‌లో నాగార్జున అతిని తిట్టే వాళ్లూ చాలా ఎక్కువ మంది వున్నారు. నాగ్ ఏ చిన్న పొరపాటు చేసినా సోషల్ మీడియా వేదికగా ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు.
అయితే, ఈ సారి బిగ్‌బాస్‌‌ని ఎలాంటి మొనాటినీకి దారి తీయకుండా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌లోనే నడిపించాలని నిర్వాహకులు గట్టిగా ప్లాన్ చేశారట. ఎంతవరకూ అమలు చేస్తారన్నది ముందు ముందు ప్రేక్షకులు తేలుస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com