యూఏఈ మానవ వనరుల శాఖ కొత్త వాట్సాప్ నంబర్.

- September 07, 2022 , by Maagulf
యూఏఈ మానవ వనరుల శాఖ కొత్త వాట్సాప్ నంబర్.

యూఏఈ: యూఏఈ మానవ వనరుల శాఖ 24 గంటల సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏ సమయంలోనైనా తమ సమస్యలను జస్ట్ ఒక్క మెసేజ్ ద్వారా తెలియజేసే విధంగా వాట్సాప్ నంబర్ ను తీసుకొచ్చింది. ఈ నంబర్ కు మెసేజ్ చేయటం ద్వారా తమ ట్రాన్ జక్షన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. ఎంప్లాయి మెంట్ రెగ్యులేషన్, డొమెస్టిక్ వర్కర్స్ లా , యూఏఈ లేబర్ మార్కెట్ రెగ్యులేషన్స్ ను ఈ వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. అవసరమైన ప్రభుత్వ శాఖలకు ఈ వాట్సాప్ నంబర్ తో అనుసంధానం చేశారు. తమ సమస్య ల గురించి ఎవరైనా మెసేజ్ చేయటంతో పాటు కస్టమర్ కేర్ తోనూ మాట్లాడవచ్చు. ఈ సేవలు ప్రవాసులకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం తెలిపింది. 600590000 నంబర్ కు అరబ్ లో గానీ ఇంగ్లీష్ గానీ మెసేజ్ చేయవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com