బిగ్‌బాస్ రుసరుసలు: భలే కిరికిరి పెట్టేశాడుగా.!
- September 09, 2022
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 బుల్లితెరపై గత నాలుగు రోజులుగా సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఫస్ట్ డేనే గలాటీ గీతూతో హౌస్‌లో రచ్చ చేయించాడు బిగ్‌బాస్. ఎప్పుడూ ఫస్ట్ డేనే నామినేషన్ల పర్వం పెట్టే బిగ్‌బాస్, ఈ సారి రెండో రోజుకి ఆ ఘట్టాన్ని మార్చాడు.
ముగ్గురు కంటెస్టెంట్లను గేమ్ పేరు చెప్పి డైరెక్ట్‌గా నామినేట్ చేశాడు బిగ్‌బాస్. మరో నలుగురు కంటెస్టెంట్లు నామినేషన్ ఎపిసోడ్ ద్వారా ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. మొత్తానిక ఏడుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వచ్చేందుకు పోటీ పడుతున్నారు.
కాగా, హౌస్ విషయానికి వస్తే, సింగర్ రేవంత్‌పై కాస్త ఎక్కువ నెగిటివిటీ కనిపిస్తోంది హౌస్‌లో. మెజార్టీ కంటెస్టెంట్లతో సింగర్ రేవంత్ టార్గెట్ అవుతున్నాడనిపిస్తోంది. తాజాగా అరోహి రావుకీ, సింగర్ రేవంత్కీ మధ్య ఓ గేమ్ కారణంగా గొడవ మొదలైంది.
ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారడంతో, తాను హౌస్‌లో వుండలేననీ ఎలాగైనా హౌస్ నుంచి బయటికి పంపించేయాలంటూ రేవంత్, బిగ్‌బాస్‌ని కోరాడు. నాటకాలు ఆడడం నాకు రాదు.. నేను ఎలా వున్నానో అలాగే వుంటాను. లేదంటే, హౌస్ నుంచి బయటికి పోతా.. అంటూ రేవంత్ కాస్త సీరియస్ అయ్యాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







