జపాన్‌లో రోజుల్లో రెండు భారీ భూకంపాలు

- April 16, 2016 , by Maagulf
జపాన్‌లో రోజుల్లో రెండు భారీ భూకంపాలు

: జపాన్‌లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగింది. 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేసింది. 32 మందికి మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.అనేక ప్రాంతాల్లో ప్రజలు సజీవ సమాధి అయినట్లు తెలిపారు. కొండచరియల దెబ్బకు కుమమొటోలో ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. వేలాది టన్నుల బురద పేరుకుపోయింది. భారీవర్షంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com