ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రోజుల పర్యటన
- April 17, 2016
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం దిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం బయల్దేరి దిల్లీకి చేరుకుంటారు. సోమవారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలుస్తారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీల అమలు, ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల బదలాయింపు, తొమ్మిదో, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా ఇతర అంశాలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొస్తారు. గవర్నర్ పర్యటన సాధారణమేనని, ఆయన మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలుస్తారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









