కేసీఆర్ కు అస్వస్థత...

- April 17, 2016 , by Maagulf
కేసీఆర్ కు అస్వస్థత...

తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. అత్యవసరంగా ఆయనకు వైద్యులు సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్వల్పంగా జర్వంతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి అత్యవసరమని వైద్యలు చెప్పారట. ప్రస్తుతం ఆయన మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.జ్వరం కారణంగా కేసీఆర్ అధికారి కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా రద్దయ్యాయి. కనీసం మూడు రోజుల వరకూ సీఎం సాధారణ కార్యక్రమాలకు హాజరుకాలేకపోవచ్చని తెలుస్తోంది. ఫామ్ హౌజ్ నుంచి మూడు రోజులపాటు కేసీఆర్ బయటకు రాకపోవచ్చు. సీఎం అస్వస్థత వార్త విని టీఆర్ఎస్ శ్రేణులు కాస్త కంగారు పడినా.. స్వల్ప జర్వమేనని తెలుసుకుని ఊరట చెందాయి.ఓవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ.. కేసీఆర్ అస్వస్థత వార్త అందరినీ కలవరపరిచింది. తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. శనివారం గరిష్టంగా నిజామాబాద్ లో గరిష్టం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాయువ్య భారత్‌ నుంచి ఉష్ణగాలులు వీస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 5 వరకు బయటకు వెళ్లడం ప్రమాదకరణని వైద్యులు చెబుతున్నారు. రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. తెలంగాణ అంతటా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే దాదాపు 17 మంది వరకూ వడగాల్పులతో మృత్యువాత పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com