‘తార్ మార్ టక్కర్ మార్..’: మెగాస్టార్, సల్మాన్ ఖాన్ డాన్సింగ్ వార్.!
- September 14, 2022
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజ్‌కి మరికొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి వుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా వుంది ఈ ఫస్ట్ సింగిల్‌కి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్. ఎందుకుండదూ.. ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్‌పై తమదైన స్కిల్స్‌తో డాన్స్ స్టెప్పులు ఇరగదీశారు మరి. జస్ట్ శాంపిల్ మాత్రమే వదిలారు ప్రస్తుతం. అసలు సిసలు హంగామా సెప్టెంబర్ 15న వుండనుంది.
‘తార్ మార్ టక్కర్ మార్..’అనే సాంగ్‌కి సంబంధించిన చిన్న ప్రోమో ఇది. మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ తమదైన స్టైల్లో స్వాగ్ స్టెప్పులు ఇరగదీయనున్నారు ఈ సాంగ్‌లో. జస్ట్ శాంపిల్‌గా వదిలిన ఈ సాంగ్ వీడియోకే, ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయ్. ఇక ఫుల్ వీడియో వచ్చేస్తే ఆ కిక్కు వేరే లెవల్ అంతే.
పెప్సీ నెంబర్ అంటూ రిలీజ్ చేసిన ఈ సాంగ్‌కి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. ఈ సాంగ్ షూటింగ్ కోసం ముంబయ్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేశారట. విజువల్‌గా ఈ సాంగ్ దుమ్ము రేపేయనుందని అంటున్నారు. ఇక స్టెప్ప్ వేయడానికి రెడీగా వుండండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇంకెందుకాలస్యం. రెడీ అయిపోండిక.!
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో పాటూ, నయన తార మరో కీలక పాత్ర పోషిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







