పెళ్లి విషయంలో నివేదా థామస్ అభిప్రాయమేంటో తెలుసా.?

- September 14, 2022 , by Maagulf
పెళ్లి విషయంలో నివేదా థామస్ అభిప్రాయమేంటో తెలుసా.?

మలయాళ బ్యూటీ నివేదా థామస్‌ని పెళ్లి గురించి అడిగితే చాలా విచిత్రంగా సమాధానమిచ్చింది. ఇంటర్వ్యూ కోసం ఏదో ఒకటి చెప్పాలంటే, చెప్పేస్తాను. కానీ, నేను అలా చెప్పాలనుకోవడం లేదు. ఇప్పటికైతే పెళ్లి చేసుకునే అభిప్రాయం లేదు. కానీ, చేసుకునే టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్పి చేసుకుంటానని చెప్పింది నివేదా థామస్.
అలాగే, పెళ్లి చేసుకుంటే బావుంటుంది.. అని క్యూట్‌గా నవ్వేసింది. నివేదా థామస్ ప్రస్తుతం ‘శాకినీ ఢాకినీ’ సినిమాలో నటిస్తోంది. ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగానే సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటోంది నివేదా థామస్.
నివేదాతో పాటు, ఈ సినిమాలో రెజీనా కసండ్రా కూడా నటిస్తోంది. దక్షిణ కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్’కి రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్. నివేదా థామస్, రెజీనా పాత్రలు చాలా కొత్తగా వుండనున్నాయట ఈ సినిమాలో. సినిమాకి ప్రి రిలీజ్ బజ్ బాగానే వుంది కానీ, ఏ స్థాయిలో అంచనాలు అందుకుంటుందో చూడాలి మరి.
‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే, మేకింగ్ సమయంలోనే సుధీర్ వర్మకు ప్రొడక్షన్ టీమ్‌తో గిల్లి కజ్జాలు రావడంతో, సినిమా ప్రమోషన్లకు హ్యాండిచ్చాడంటూ ప్రచారం జరిగింది. నిజంగానే సుధీర్ వర్మ ప్రమోషన్లలో ఎక్కడా కనిపించడం లేదు. దాంతో మొత్తం బాధ్యతను హీరోయిన్లు నివేదా, రెజీనా తమ భుజాలపై వేసుకున్నారు. చూడాలి మరి, ఈ ముద్దుగుమ్మల కష్టం ఫలిస్తుందో లేదో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com