త్రివిక్రమ్-మహేష్ ప్రాజెక్ట్‌పై కొత్త గాసిప్ నిజమేనా.?
- September 14, 2022
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ గురించి తాజాగా ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో నటించబోతున్నాడనేది ఆ గాసిప్ సారాంశం.
పాపులర్ యంగ్ హీరో అనీ తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో కూడా ఇలాగే పొగ రాజింది. అయితే, ఒకానొక టైమ్‌లో అల్లరి నరేష్ ఈ గాసిప్‌ని ఖండించాడు కూడా.
కట్ చేస్తే, ఆ గాసిప్ నిజమైంది. ఇప్పుడు ఇంకోసారి, మహేష్ సినిమాలో ఆ యంగ్ హీరో అట.. అనే ప్రచారం జరుగుతోంది. అయితే, పేరు మాత్రం రివీల్ కాలేదు. బాగా పాపులర్ యంగ్ హీరో అంటే, ఖచ్చితంగా ఇదో మల్టీ స్టారర్ అయ్యే అవకాశం వుందని కొందరు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలున్నాయ్. ఇప్పటికే త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. ఇక, తాజా ప్రచారంతో ఆ అంచనాలు రెట్టింపు అవ్వనున్నాయ్. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో బిజీగా వుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







