అమలా పాల్ పబ్లిసిటీ స్టంట్స్: అలా అనేసిందేందబ్బా.!
- September 14, 2022
‘బెజవాడ’, ‘నాయక్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన అమలా పాల్, తమిళ డబ్బింగ్ సినిమాలతోనూ తనదైన ముద్ర వేసుకుంది టాలీవుడ్‌లో. అయితే, టాలీవుడ్‌లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే తీసుకుంటారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, టాలీవుడ్ టార్గెట్ అయిపోయింది.
అమలా పాల్, కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఇప్పుడు నిర్మాత కూడా. నిర్మాణ రంగంలో అడుగు పెట్టి చిన్న సినిమాలతో తన అభిరుచిని చాటుకుంటోంది. అలా స్వీయ నిర్మాణంలో వచ్చిన ‘కడవర్’ సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంటోంది.
ఈ సినిమాలో అమలా పాల్ పర్ఫామెన్స్‌కి ఓటీటీ ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో అమలా పాల్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ఏం బాగా లేదని సోషల్ మీడియా వేదికగా కొందరు అభిప్రాయ పడుతున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే అమలా పాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా.?
గతంలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కూడా ఇలాగే టాలీవుడ్‌పై అవాకులు చవాకులు పేలింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అమలా పాల్ కూడా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటుందా.? లేదంటే అమలా పాల్ వ్యాఖ్యలు ఎంత దూరం వెళతాయో చూడాలి మరి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







