దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సూపర్ డ్యాన్సర్ కాంపిటీషన్
- September 14, 2022
దోహా: దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ద్వారా సూపర్ డ్యాన్సర్ కాంపిటీషన్ ప్రారంభించబడింది.
ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోతో కలిసి దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ “సూపర్ డ్యాన్సర్ 2022” పేరుతో డ్యాన్స్ పోటీని నిర్వహిస్తోంది.ఆసక్తిగల పాల్గొనేవారు సెప్టెంబర్ 9 నుండి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు మరియు నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 24. సెప్టెంబర్ 30, 2022 నుండి ఆడిషన్స్ జరగనున్నాయి మరియు గ్రాండ్ ఫినాలే అక్టోబర్ 28న జరగనుంది. దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ఛైర్మన్ సయ్యద్ రఫీ ప్రకారం, నృత్యం చేయగల ఎవరైనా ఈ అద్భుతమైన నృత్య పోటీలో పాల్గొనవచ్చు. 'దోహాలో చాలా మంది అత్యంత ప్రతిభావంతులైన నృత్యకారులు ఉన్నారు, ఈ పోటీ వారి ప్రతిభను ప్రదర్శించడానికి పెద్ద వేదికను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న నృత్య ప్రతిభను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం’ అని తెలిపారు.
ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియో యజమానులు సంగీత, జ్యోతి మాట్లాడుతూ డ్యాన్స్ను ప్రోత్సహించడంతోపాటు నిజమైన ప్రతిభ ఉన్న వ్యక్తిని గుర్తించి అవార్డులు అందజేయడమే తమ ధ్యేయమన్నారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ, పోటీల ముగింపును అందమైన ఆడిటోరియంలో గ్రాండ్గా నిర్వహించాలని కోరారు మరియు అద్భుతమైన ప్రదర్శనలను ఆశిస్తున్నాను అని సంతోషంగా అన్నారు.
'వాయిస్ ఆఫ్ వరల్డ్' షోకి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, దోహా మ్యూజిక్ లవర్స్ ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోతో అనుబంధంగా సూపర్ డ్యాన్సర్ అని పిలువబడే మరో పోటీని ప్రారంభమిస్తోంది అని మొహిందర్ మరియు వందన రాజ్ అన్నారు.వయస్సు, లింగం, శైలి మరియు జాతీయతతో సంబంధం లేకుండా నృత్యకారులందరూ దరఖాస్తు చేసుకోవడానికి స్వాగతం పలుకుతున్నామని జావీద్ బజ్వా మరియు మధు వంటేరు అన్నారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల, ప్రధాన కార్యదర్శి విక్రమ్
సుఖవాసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సూపర్ డ్యాన్సర్ కాంపిటీషన్లో పాల్గొన్న ఇతర సిబ్బంది దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్కి చెందిన అశోక్ రాజ్, అస్లాం చెనియేరి, సారా అలీ ఖాన్.ఛానల్ 5 దోహా మరియు MAA గల్ఫ్ పోటీకి మీడియా భాగస్వాములుగా ఉంటాయని సయ్యద్ రఫీ తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







