తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
- September 15, 2022
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని టిఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. గురువారం ఈ మేరకు సీఎం కెసిఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా గురువారం సాయంత్రంలోగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటూ పలు వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు… ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ టిఆర్ఎస్ సర్కారు ఇటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







