భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
- September 15, 2022
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గజియాబాద్లోనున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ,బీటెక్,ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 యేళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bel-india.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







