19శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసిన అల్ హబ్తూర్

- September 15, 2022 , by Maagulf
19శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసిన అల్ హబ్తూర్

యూఏఈ: యూఏఈకి చెందిన అల్ హబ్టూర్ గ్రూప్ 2022 ప్రథమార్థంలో పటిష్ఠమైన పనితీరును నమోదు చేసి 19 శాతం వృద్ధిని సాధించిందని అల్ హబ్తూర్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ తెలిపారు. 2021 ఇదే కాలంతో పోలిస్తే వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణాల చెల్లింపులు పోగా సంస్థ ఆదాయాలలో 36 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు. హబ్తూర్ హాస్పిటాలిటీ 2022 మొదటి అర్ధ భాగంలో 2021లో అదే కాలంతో పోలిస్తే ఆదాయాలలో 82 శాతం పెరుగుదల నమోదు చేసిందన్నారు. అల్ హబ్తూర్ మోటార్స్, బెంట్లీ, బుగట్టి, మిత్సుబిషిలకు 2022 మొదటి అర్ధ భాగంలో 34 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేశాయని అల్ హబ్తూర్ చెప్పారు. కార్ లీజింగ్ డివిజన్ డైమండ్‌లీజ్.. 12,700 కంటే ఎక్కువ వాహనాలు కలిగిఉందని, ఈ సంవత్సరం ప్రథమార్థంలో 52 శాతం ఆదాయం పెరిగిందని అని అల్ హబ్తూర్ తెలిపారు. టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ శాఖ ప్రకారం.. దుబాయ్ ని 2022 మొదటి ఆరు నెలల్లో 7.12 మిలియన్ల టూరిస్టులు సందర్శించారు.  గత సంవత్సరంతో పోలిస్తే 183 శాతం పెరిగింది. ఎమిరేట్‌లోని హోటల్ రూమ్‌ల సంఖ్య 22 శాతం పెరిగింది. 2019 మొదటి అర్ధభాగంతో పోలిస్తే అందుబాటులో ఉన్న హోటల్ రూమ్‌ ఆదాయం 540 దిర్హామ్‌లకు ($147.02) పెరిగింది. దుబాయ్ ఆధారిత హోటలియర్, లీజర్ గ్రూప్ AHG యూఏఈతోపాటు లండన్, వియన్నా, బుడాపెస్ట్, బీరుట్, అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్‌లలో పనిచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com