‘శాకినీ ఢాకినీ’ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది.!

- September 15, 2022 , by Maagulf
‘శాకినీ ఢాకినీ’ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది.!

రెజీనా కసండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘శాకినీ ఢాకినీ’. కొరియన్ మూవీకి రీమేక్‌గా రూపొందింది ఈ సినిమా. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ కాన్సెప్ట్‌ని చొప్పించారట. 
రీమేక్ మూవీనే అయినా ఆ కాన్సెప్టు ఈ సినిమాకి చక్కగా సూట్ అయ్యిందనీ అంటున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమాని కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించారు. రీమేక్ మూవీనే అయినా, కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నారట. పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సినిమాని రూపొందించారట.
రీసెంట్‌గా జరిగిన ఓ నేరానికి సంబంధించిన అంశాన్ని ఈ సినిమాలో ప్రస్థావించారట. అదే సినిమాకి కీలకం అని చెబుతున్నారు. ఆ నేరాన్ని పరిష్కరించే ట్రైనీ పోలీసులుగా నివేదా, రెజీనా నటిస్తున్నారు. ఓ మహిళ సమస్యను మరో మహిళే చెబితేనే అర్ధమవ్వాల్సిన విధంగా అర్ధమవుతుందనీ, అందుకే ఈ సినిమాని పూర్తిగా మహిళల కోణంలో తీశామనీ చిత్ర నిర్మాత తాటి సునీత చెబుతున్నారు.
సీరియస్ కాన్సెప్ట్ అయినా, కాస్త కామెడీ టోన్‌లో చెప్పామనీ, అలాగే, సెంటిమెంటల్‌గా ఈ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందనీ ఆమె పేర్కొన్నారు. ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయ్. శుక్రవారం ‘శాకినీ ఢాకినీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com