‘నేను మీకు బాగా కావల్సినవాడిని’ అంటున్న కిరణ్ అబ్బవరం
- September 15, 2022
‘రాజావారు రాణివారు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కుర్రోడు కిరణ్ అబ్బవరం. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ కుర్ర హీరో ఇండస్ర్టీ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు. అలాగే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకున్నాడు.
‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘సెబాస్టియన్’ తదితర సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘నేను మీకు బాగా కావల్సినవాడిని’ అంటున్నాడు. అదేనండీ కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా టైటిలే ఇది. ఈ సినిమా ఈ శుక్రవారమే అనగా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు కిరణ్ అబ్బవరం. కోడి రామకృష్ణ బ్యానర్లో ఈ సినిమా రూపొందడం చాలా ఆనందాన్నిచ్చిందని కిరణ్ తెలిపాడు. అలాగే, ఈ సినిమాలో కాస్త మాస్ అప్పీల్ చూపించబోతున్నాడట కిరణ్ అబ్బవరం.
అంతేకాదు, సినిమా మొదటి నుంచి, చివరి వరకూ ఫుల్ ఎంటర్టైనర్ అని చెబుతున్నాడు. సినిమా చూస్తున్నంత సేపూ కడుపుబ్బా నవ్వుకుంటారట. రివ్యూ చూసి సినిమాలకు వెళ్లే ఈ రోజుల్లో తన సినిమాని మాత్రం ధియేటర్లో చూసి బాగుంటేనే మరో పది మందికి చూడమని చెప్పమని చెబుతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇదేదో లలితా జ్యూయలరీ కిరణ్ ప్రమోషన్ని తలపించట్లా.!
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







