అక్టోబర్‌లో రకుల్ డబుల్ ధమాకా.! స్పీడు మామూలుగా లేదుగా.!

- September 15, 2022 , by Maagulf
అక్టోబర్‌లో రకుల్ డబుల్ ధమాకా.! స్పీడు మామూలుగా లేదుగా.!

తెలుగులో ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణీ అయిన రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. వరుస సినిమాలతో అక్కడ చాలా చాలా బిజీ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.
అక్టోబర్‌లో రకుల్ ప్రీత్ నటించిన ‘థాంక్ గాడ్’ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇంద్రకుమార్ ఈ సినిమాకి దర్శకుడు. అజయ్ దేవగణ్, సిద్దార్ధ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్నారు. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సంగతి అలా వుంటే, అదే నెలలో అంతకన్నా ముందే మరో సినిమా కూడా లైన్‌లోకి వచ్చింది. అదే, ‘డాక్టర్ జి’. ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్ 14న ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాలో డాక్టర్‌గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. 
రెండు సినిమాలూ బ్యాక్ టు బ్యాక్ ఒకే నెలలో వస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది రకుల్ ప్రీత్. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే, రకుల్ ప్రీత్ సింగ్‌కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయని చెప్పొచ్చు. ‘కొండపొలం’ సినిమాలో నటించింది ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ అను తమిళ్, తెలుగు బైలింగ్వల్ మూవీలోనూ రకుల్ ప్రీత్ నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com