ఎన్టీఆర్‌తో రష్మిక ఇలాగైనా సెట్ అవుతుందా.?

- September 15, 2022 , by Maagulf
ఎన్టీఆర్‌తో రష్మిక ఇలాగైనా సెట్ అవుతుందా.?

ఎన్టీయార్-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాకి సంబంధించి రోజూ ఏదో ఒక రూమర్ హల్‌చల్ చేస్తోంది. ఇంకా ఈ సినిమా పట్టాలెక్కనే లేదు. కానీ, అదిగో పులి, ఇదిగో తోక.. అన్నట్లుగా పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయ్.
ఆ పుకార్లలో భాగంగా తాజాగా మరో పుకారు తెరపైకి వచ్చింది. ఇంతవరకూ ఈ సినిమాలో హీరోయిన్ కన్‌ఫామ్ కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీయార్‌‌ని ఈ సినిమాతో మరోసారి ప్యాన్ ఇండియాకి తీసుకెళ్లబోతున్నాడు కొరటాల శివ. 
అందుకే ఈ సినిమాలో నటించే హీరోయిన్ కూడా అదే రేంజ్‌లో వుండాలి. అందుకే బాలీవుడ్ నుంచి అలియా భట్, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయ్. అలియా భట్ మొదట ఓకే చెప్పినా, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా ఆ డీల్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, జాన్వీ కపూర్ గురించి ఎంత ట్రై చేస్తున్నా కుదరడం లేదు.
ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మండన్నా పేరు తెరపైకి వచ్చింది. రష్మికకు ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా గుర్తింపు దక్కింది. అలాగే ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ సినిమాలతో తెగ బిజీగా గడుపుతోంది. సో, రష్మిక అయితే, ఈ సినిమాకి ప్యాన్ ఇండియా ఫ్లేవర్ రావడం ఖాయమని మేకర్లు భావిస్తున్నారట. 
ఇంతవరకూ రష్మిక, ఎన్టీయార్‌తో స్ర్కీన్ షేర్ చేసుకున్నది లేదు. సో, అలా ఈ సినిమాతో ఈ కాంబినేషన్ సెట్టవ్వనుందన్న మాట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావల్సి వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com