ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే.. 1,000 దిర్హామ్‌ల జరిమానా

- September 16, 2022 , by Maagulf
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే.. 1,000 దిర్హామ్‌ల జరిమానా

యూఏఈ: ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే వాహనదారులకు భారీ జరిమానా విధిస్తామని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ హెచ్చరించింది. ప్రయాణికులు తమ భద్రతతోపాటు ఇతరుల భద్రతను కాపాడాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా చిన్నపాటి మరమ్మతులు, ప్రమాదాలు జరిగిన సమయంలో తమ వాహనాలను రోడ్డు పైనుంచి తీసి సమీపంలోని సేఫ్ పాయింట్ వద్ద నిలపాలని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ మేజర్ అబ్దుల్లా అల్ మంధారి తెలిపారు. చిన్న ట్రాఫిక్ ప్రమాదాల సమయంలో కొంతమంది వాహనదారులు రోడ్డు మధ్యలో తమ వాహనాలను ఆపివేయడం వల్ల ఇతర వాహనదారుల భద్రతకు హాని కలిగిస్తుందన్నారు. ప్రమాద సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ పెట్రోలింగ్‌ల వచ్చే వరకు ఆగకుండా వెంటనే వాహనాలను రోడ్డుపైనుంచి తీసేందుకు ప్రయత్నించాలని వాహనదారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో గుమిగూడవద్దని వాహనదారులకు అల్ మంధారి పిలుపునిచ్చారు. ఇది ప్రమాదాన్ని పెంచడంతోపాటు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తుందన్నారు.  ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ నంబర్ (74) ప్రకారం.. ప్రమాదాల సమయంలో ట్రాఫిక్‌కు (సేకరణ) అడ్డుగా ఉండే వాహన యజమానులకు 1,000 Dhs జరిమానా విధిస్తారని అల్ మంధారి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com