సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించేందుకు అనుమతివ్వాలని దుబాయ్ కోర్టు ను కోరిన అటార్నీ జనరల్
- September 16, 2022
దుబాయ్ : పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసిన డానిష్ జాతీయుడు సంజయ్ షా ను ఆ దేశానికి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్ దుబాయ్ కోర్టు ను అభ్యర్థించారు. డెన్మార్క్ లో పన్ను ల ఎగవేతకు పాల్పడిన సంజయ్ షా దేశం నుంచి పారిపోయి దుబాయ్ చేరుకున్నారు. ఐతే డానిష్ పోలీసుల విజ్ఞప్తి మేరకు దుబాయ్ పోలీసులు అతన్ని దుబాయ్ లో అరెస్ట్ చేశారు. నేరస్తుల అప్పగింత లో భాగంగా సంజయ్ షా ను డెన్మార్క్ కు అప్పగించాల్సి ఉంది. ఐతే దుబాయి కోర్టు మాత్రం ఈ అప్పగింతకు నో చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా పరస్పర సహకారం కోసం డెన్మార్క్ కు సంజయ్ షా ను అప్పగించే విషయంలో సానుకూలంగా స్పందించాలని దుబాయ్ ప్రభుత్వం కోర్టును కోరింది. అటార్నీ జనరల్ ఎస్సాం ఇస్సా అల్ హుమేదన్ స్వయంగా ఈ విషయంలో కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు ఈ విషయంలో మరోసారి విచారణ జరపనుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







