సక్సెస్ ఫుల్ గా ముగిసిన 'షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022'

- September 16, 2022 , by Maagulf
సక్సెస్ ఫుల్ గా ముగిసిన \'షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022\'

షార్జా: షార్జా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCCI) ఆధ్వర్యంలో నిర్వహించిన "షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022" ఘనంగా ముగిసింది. దాదాపు 67 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చినట్లు  SCCI డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అమీన్ అల్ అవడి చెప్పారు. "షార్జా సమ్మర్ ప్రమోషన్స్ 2022 ఎడిషన్  సక్సెస్ అయ్యింది. షార్జా షాపింగ్ మాల్స్ కు, షాపింగ్ సెంటర్లకు వేలాది మంది పర్యాటకులు వచ్చారు. ఫ్యామిలీ తో వెళ్లేందుకు అనువైన టూరిస్ట్ ప్రదేశాల్లో ప్రపంచంలోనే షార్జా ఒకటిగా నిలిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది" అని ఆయన అన్నారు. అటు "ఈ ఈవెంట్  ద్వారా షార్జా ఆర్థిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఎంతో మేలు జరిగింది" అని SCCI ఎకనామిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్  ఇబ్రహీం రషీద్ అల్ జర్వాన్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com