ప్రబాస్ కోసం బిగ్ బి పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్.!

- September 16, 2022 , by Maagulf
ప్రబాస్ కోసం బిగ్ బి పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్.!

యూనివర్సల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రబాస్ సినిమాలో వివిధ రకాల భాషల నుంచి ప్రముఖ నటీ నటులు నటిస్తూ వస్తున్నారు ‘సాహో’ సినిమా నుంచి. ఇక తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రముఖ నటీనటులు కీలక ప్రాతలు పోషిస్తున్నారు. 
‘ప్రాజెక్ట్ కె’ ఇదో భారీ బడ్జెట్ చిత్రం.కేవలం ప్యాన్ ఇండియానే కాదు, ప్యాన్ వరల్డ్ టార్గెట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. చైనా, అమెరికా వంటి పెద్ద దేశాల టార్గెట్‌గా ఈ సినిమాని రూపొందింస్తున్నామనీ ఆయన గతంలో తెలిపారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి ప్రముఖ నటీ నటులు ఆయా కీలక పాత్రల్లో నటిస్తుండగా, అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర అత్యంత కీలకం. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర స్పూర్తితో ఈ పాత్రను డిజైన్ చేశారు.
హైలీ యాక్షన్ ప్యాక్‌డ్ కాన్సెప్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోసం ఓ ప్రత్యేకమైన యాక్షన్ బ్లాక్ వుందట. లాంగ్ బ్యాక్ తర్వాత బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ని పవర్ ఫుల్ యాక్షన్ అవతార్‌లో చూడబోతున్నామనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
సుదీర్ఘమైన యాక్షన్ బ్లాక్‌గా ఈ ఎపిసోడ్‌ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.ప్రబాస్‌తో పాటూ, లాంగ్ యాక్షన్ సీక్వెన్స్‌లో అమితాబ్ కూడా పర్‌ఫామ్ చేయబోతున్నారట. నలుగురైదుగురు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్లు ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేయబోతున్నారట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com