మెగా హీరో న్యూ స్కెచ్: కొత్త డైరెక్టరే కానీ, తెర వెనుక తతంగం వేరే.!
- September 17, 2022
తొలి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అదేనండీ మెగా హీరో వైష్ణవ్ తేజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం.తొలి సినిమా ‘ఉప్పెన’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడీ యంగ్ హీరో. ఆ తర్వాత ‘కొండపొలం’ అనే చిన్న సినిమాలో నటించాడు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని లో బడ్జెట్‌లో చాలా క్యాజువల్‌గా తెరకెక్కించేశారు.పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే రిలీజ్ చేశారు. సినిమాటిక్‌గా ఓకే కానీ, వైష్ణవ్ తేజ్‌ని స్టార్‌గా మలిచేందుకు ఈ సినిమా చాలదు.
మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు వైష్ణవ్ తేజ్. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు ఈ సినిమాకి.
దాంతో అర్జెంటుగా వైష్ణవ్‌కి ఓ హిట్టు కావాలి. ఈ సారి కొత్త డైరెక్టర్‌తో తన నాలుగో సినిమాని ఓకే చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి అనే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో కమిట్ అయ్యాడు. డైరెక్టర్ కొత్తోడే అయినా, ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ పెద్ద తలకాయ వుండడం విశేషం. ఎవరా పెద్దతలకాయ్.? అని ఆలోచిస్తున్నారా.? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
కథలో, స్క్రీన్ప్లే లో ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్‌పుట్స్ అందించనున్నారట. అన్నట్లు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ త్రివిక్రముడి భార్య సౌజన్య త్రివిక్రమ్. అందుకే ఈ సినిమా బాధ్యతను త్రివిక్రమ్ తన భుజాలపై వేసుకున్నాడట.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సౌజన్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







