సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం.. యూఏఈ పోలీసుల హెచ్చరిక

- September 17, 2022 , by Maagulf
సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం.. యూఏఈ పోలీసుల హెచ్చరిక

యూఏఈ: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఒకటని  అబుధాబి పోలీసులు తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలను పోలీసులు మరోసారి వాహనదారులకు గుర్తు చేశారు. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక అవగాహన వీడియోను షేర్ చేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు  ఎమిరేట్‌లోని 100,000 కంటే ఎక్కువ మంది డ్రైవర్లు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారని పేర్కొంది. నిబంధనల ప్రకారం వారికి Dh800 జరిమానాతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్‌లను విధించినట్లు పోలీసులు తెలిపారు. ఎమిరేట్ రోడ్లపై ఉన్న హై-టెక్ రాడార్లు సెల్ ఫోన్ డ్రైవింగ్ ను గుర్తించగలవని, అధునాతన సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ పెట్రోలింగ్ కూడా ట్రాఫిక్ ఉల్లంఘలను పర్యవేక్షిస్తాయన్నారు. అబుధాబి పోలీస్‌లోని ట్రాఫిక్ డైరెక్టరేట్ డైరెక్టర్ మేజ్ మొహమ్మద్ దహి అల్ హుమిరి గతంలో మాట్లాడుతూ.. చాలా మంది ఫోన్‌లలో మాట్లాడటం లేదా మెసేజ్ లు పంపుతూ పట్టుబడ్డారని చెప్పారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో చాట్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఫోటోలు తీయడం లేదా వీడియోలు షూట్ చేయడం వంటివి చేస్తూ.. ట్రాఫిక్ చట్టాన్ని నిర్మొహమాటంగా ఉల్లంఘిస్తున్నరని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com