బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 2’ వచ్చేదెప్పుడంటే.!

- September 17, 2022 , by Maagulf
బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 2’ వచ్చేదెప్పుడంటే.!

బాలయ్య కొడితే దిమ్మ తిరిగి నెక్స్‌ట్ బర్త్‌డేలు లేకుండా పోవడం, ఆయనకు బీపీ వస్తే ఏపీ వణికి పోవడం.. లాంటి భీకరమైన స్ర్కిప్టెడ్ డైలాగులు స్ర్కీన్‌పై చించేయడమే కాదు, స్టేజ్‌పై యాంకర్‌గానూ ఓన్ డైలాగులు పేల్చగలరని తెలిపిన షో ‘అన్ ‌స్టాపబుల్’. 
బాలయ్యలోని నెక్స్‌ట్ లెవల్ యాంగిల్‌ని బయటికి తీసిన షో ఇది. ఏదో జస్ట్ క్యాజువల్‌గా సరదాగా స్టార్ట్ చేసిన ఈ షోకి ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. దాంతో, సెకండ్ సీజన్ కోసం సన్నాహాలు చేయాలని తలంచారు ఆహా నిర్వాహకులు. 
ఆ క్రమంలోనే సర్వం సిద్ధం చేశారు. ఆగస్టులోనే ఈ షో సెకండ్ సీజన్ స్టార్ట్ అవ్వాల్సి వుంది. కానీ, బాలయ్య, గోపీచంద్ సినిమాతో బిజీగా వుండడం వల్ల కుదరలేదు. ఇక రీసెంట్‌గా ఆ సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసిన బాలయ్య, ‘అన్ స్టాపబుల్ 2’పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
త్వరలోనే అంటే సెప్టెంబర్ చివరి వారంలోనే ఈ షో స్టార్ట్ కానుందని తాజాగా అందుతోన్న సమాచారం. స్టార్ సెలబ్రిటీలతో బాలయ్య చేసిన ఓపెన్ ఇంటర్వ్యూలు ప్రేక్షకుల్ని ఫిదా చేశాయి. మొదటి సీజన్‌లో మొదటి స్టార్ సెలబ్రిటీగా మోహన్ ‌బాబు రాగా, రెండో సీజన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని ఖచ్చితంగా తీసుకురానున్నారనీ తెలుస్తోంది. 
ఆల్రెడీ, మెగాస్టార్ చిరంజీవితో బాలయ్య అండ్ టీమ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, రెండో అన్‌స్టాపబుల్‌కి మెగాస్టార్ ఎంట్రీ సరికొత్త ఊపు తీసుకురానుందేమో.! 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com