‘లైగర్’ దెబ్బకి డైలమాలో పడ్డ రౌడీ.! ఏం చేస్తాడంటే.!
- September 17, 2022
సెన్సేషనల్ స్టార్‌గా విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అయితే, లేటెస్టుగా వచ్చిన ‘లైగర్’ సినిమా రౌడీ ఇమేజ్‌ని బాగా దెబ్బ తీసేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి ముందు వీర లెవల్‌లో హడావిడి చేసిన విజయ్ దేవరకొండ, సినిమా రిజల్ట్ తర్వాత పూర్తిగా మాయమైపోయాడు.
సోషల్ మీడియాలోనూ సందడి లేదు. తన తదుపరి ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా ఎలాంటి అప్‌డేట్ లేదు. నిజానికి ‘లైగర్’ హిట్ అయ్యి వుంటే, పూరీ జగన్నాధ్‌తోనే నెక్స్‌ట్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ స్టార్ట్ చేసేసి, ఏదో ఒక రకంగా సోదిలో వుంటూ అటెన్షన్ గెయిన్ చేసేవాడు.
కానీ, సీన్ రివర్స్ అవ్వడంతో సైలెంట్ అయిపోయాడు. అయితేనేం, విజయ్ దేవరకొండ చేతిలో ‘ఖుషీ’ మూవీ వున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపైనే ఇప్పుడు రౌడీ ఆశలన్నీ. సమంత వుండడంతో ఈ సినిమాకి హైప్ బాగానే వుంది.
ఇదిలా వుంటే, విజయ్ దేవరకొండ లిస్టులో మరో ప్రాజెక్ట్ కూడా వుందట. అదే ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీ. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ కాంబినేషన్‌లో ఓ స్టోరీ లైన్ ఎప్పుడో ఓకే చేసి పెట్టారట. అయితే, రీసెంట్‌గా ఇంద్రగంటికీ పెద్ద షాకే తగిలింది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’ రూపంలో. సో, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రౌడీ డైలమాలో పడ్డాడట. ఏం జరుగుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







