మానవ అక్రమ రవాణా.. ప్రవాసుడికి ఐదేళ్ల జైలు శిక్ష

- September 21, 2022 , by Maagulf
మానవ అక్రమ రవాణా.. ప్రవాసుడికి ఐదేళ్ల జైలు శిక్ష

సౌదీ: సౌదీ అరేబియాలోకి అక్రమ మానవ రవాణాను ప్రొత్సహించినందుకు అరబ్ జాతీయుడికి ఐదేళ్ల జైలు శిక్షను విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితుడు $4,000లకు ఆశపడి పొరుగు దేశం నుండి సౌదీ రాజ్యంలోకి ప్రజలను అక్రమంగా తరలించడానికి సరిహద్దు నేరస్థుల ముఠాతో అంగీకరించాడని దర్యాప్తులో వెల్లడైందన్నారు. అతన్ని అరెస్టు చేసి సంబంధిత కోర్టుకు తరలించినట్లు తెలిపింది. కాగా, ఈ తీర్పుపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. మానవ అక్రమ రవాణాలో దోషిగా తేలిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com