మెట్రో మరియు లుసైల్ ట్రైన్ డిజైన్ల ఆవిష్కణ
- April 17, 2016
ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ వెహికిల్స్ డిజైన్లను ఆవిష్కరించింది. 2020 నాటికి ఈ ప్రాజెక్ట్ సాకారం కానుంది. ఖతారి సంస్కృతి అలాగే మోడర్న్ టెక్నాలజీ కలగలిసి అల్ పరాస్ (దోహా మెట్రో కోసం), అల్ మెహ్మెల్ (లుసైల్ ట్రామ్ కోసం) రైల్వే వెహికిల్స్ ఎక్స్‌టీరియర్ డిజైన్స్‌ని రూపొందించారు. దోహా మెట్రో కోసం రూపొందించిన రైల్ డైనమిక్ షేప్‌కి అల్ ఫరాస్ అని పేరు పెట్టారు. ఇది డ్రైవర్ లెస్ ట్రైన్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే డ్రైవర్ లెస్ మెట్రో రైల్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగం ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైల్ ప్రత్యేకత. పెరల్ ఫిషింగ్ బోట్ 'ధో'ని గుర్తు చేసేలా 'అల్ మెహమిల్'ని డిజైన్ చేశారు. ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ సుబైయీ మాట్లాడుతూ, సంప్రదాయ మరియు ఆధునికత కలగలిసి ఈ డిజైన్లను రూపొంచామని చెప్పారు. 75 ట్రైన్లు, ఒక్కోదాంట్లో మూడు కార్స్ ఉంటాయి. వీటిల్లో గోల్డ్, ప్యామిలీ క్లాస్, స్టాండర్డ్ క్లాస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గోల్డ్‌లో 16 సీట్లు, ఫ్యామిలీలో 26 సీట్లు, స్టాండర్డ్‌లో 88 సీట్లు ఉంటాయి. కినికి షార్యో కంపెనీ ఒసాకా, జపాన్‌లో ఈ మెట్రో రైళ్ళను డిజైన్ చేసి, తయారు చేస్తుంది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లతోపాటు, లో ఫ్లోరింగ్ కోచ్‌లు వీటి ప్రత్యేకత.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







