ఓ హారర్ ఎంటర్ టైనర్ తెలుగులో
- April 18, 2016
గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్ తెలుగులో "శశికళ" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినుభారతి దర్శకుడు.నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ గొలుపుతూ.. భయపెడుతూనే వినోదం అందించే హారర్ ఎంటర్ టైనర్ ఇది. ప్రఖ్యాత దర్శకుడు భారతిరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి భారతిరాజా శిష్యుడు విను భారతి దర్శకత్వం వహించారు. హారర్ చిత్రాలను ఆదరించేవారందరికీ "శశికళ" అమితంగా నచ్చుతుంది" అన్నారు.ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్, సంగీతం: నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: డా. శివ వై. ప్రసాద్-బి.సత్యనారాయణ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: విను భారతి!!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







