భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు Dhs5,000 చెల్లించాలి: ఫ్యామిలీ కోర్టు

- September 24, 2022 , by Maagulf
భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు Dhs5,000 చెల్లించాలి: ఫ్యామిలీ కోర్టు

అబుధాబి: తన భార్యను కొట్టి అవమానించినందుకు పరిహారంగా Dhs5,000 చెల్లించాలని ఓ భర్తను అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తనను కొట్టి, అవమానించాడని అందుకు పరిహారంగా Dhs 50,000 చెల్లించేలా తన భర్తను ఆదేశించాలని ఓ భార్య కోర్టును ఆశ్రయించింది. కానీ, తన భార్య వాదనల్లో వాస్తవం లేదని భర్త ఖండించాడు. ఆమె తన నుంచి విడాకులు పొందేందుకు ఈ విధంగా కేసు వేసిందని ఆరోపించాడు. అయితే, తన భార్య గౌరవాన్ని దెబ్బతీసినందుకు భర్తను కోర్టు దోషిగా నిర్ధారించింది. పరిహారంగా ఆమెకు Dhs5,000 చెల్లించాలని, దీనితోపాటు కోర్టు ఖర్చులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com