ఫ్రొఫెషనల్ జాబ్స్ కోసం కువైట్ వచ్చే వారికి ఇక నుంచి టెస్ట్ ల నిర్వహణ

- September 25, 2022 , by Maagulf
ఫ్రొఫెషనల్ జాబ్స్ కోసం కువైట్ వచ్చే వారికి ఇక నుంచి టెస్ట్ ల నిర్వహణ

కువైట్: కువైట్ లో ఫ్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన ఉద్యోగాలు సాధించిన ప్రవాసులకు వీసా ఇచ్చే ముందు ఇక నుంచి టెస్ట్ నిర్వహించనున్నారు. వారి ప్రతిభ, నైపుణ్యాలను తెలుసుకునేందుకు వారికి టెస్ట్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. కువైట్ సోసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) ప్రవాసులకు టెస్ట్ నిర్వహిస్తుంది. డెమగ్రాఫిక్ ఇమ్ బ్యాలెన్స్ సంస్కరణాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాన్‌పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ తెలిపారు. మొదటి సారి వచ్చే వారికి KSE ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా వర్క్ పర్మిట్ రెన్యువల్ చేసుకునే వారు కూడా ఈ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com