60,000 SR కన్నా ఎక్కువ విలువైన లగేజీ ఉంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిందే
- September 25, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా జకాత్ విభాగం (పన్నులు, కస్టమ్స్ అథారిటీ) ZATCA కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సౌదీ కి వచ్చే వారైనా, సౌదీ నుంచి విదేశాలకు వెళ్లే వారైనా 60 వేల రియల కన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్తే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని కోరింది. ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు తమ వస్తువుల వివరాలు వాటి విలువ చెప్పాల్సి ఉంటుంది. 60 వేల రియల కన్నా తక్కువ విలువ ఉన్న వస్తువులను ఎలాంటి డిక్లరేషన్ లేకుండా తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ విలువ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు, గోల్డ్, విదేశీ కరెన్సీ ఇలాంటి వాటికి తప్పకుండా డిక్లరేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ప్రయాణికులు కస్టమ్స్ పన్ను ఎగ్గొట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







