అద్దె కు ఉన్న వారి వివరాలు రిజిస్ట్రర్ చేసేందుకు రెండు వారాల సమయం

- September 25, 2022 , by Maagulf
అద్దె కు ఉన్న వారి వివరాలు రిజిస్ట్రర్ చేసేందుకు రెండు వారాల సమయం

దుబాయ్: దుబాయ్ లో చాలా మంది అపార్ట్ మెంట్లు అద్దెకు తీసుకొని సబ్ రెంట్ కు ఇస్తున్న సంగతి తెలిసిందే.దీని కారణంగా రెసిడెన్సీ చట్టం సరిగా అమలు కావటం లేదు. ఈ సమస్యను అధిగమిచేందుకు ఎమిరేట్ హౌసింగ్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ పౌరులు వారి ఇంటిని అద్దెకు ఇచ్చిన వారి వివరాలను REST అనే యాప్ లో రిజిస్టర్ చేయాలని కోరింది. ఇందుకోసం రెండు వారాల సమయం ఇచ్చింది. ఇలా రెంట్ కు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్ చేయటం ద్వారా రెసిడెన్సీ చట్టాన్ని సరిగ్గా అమలు చేయవచ్చని చెబుతోంది. అదే విధంగా యాజమాని అనుమతి లేకుండా సబ్ రెంట్ ఇస్తున్న వారి అక్రమాలను కూడా అరికట్టవచ్చని చెబుతోంది. అపార్ట్ మెంట్లు, భవనాలు, డెవలపర్లు, ప్రాపర్టీ మేనేజ్ మెంట్ కంపెనీలతో పాటు అద్దెకు ఇస్తున్న వారు...ఎవరికీ అద్దెకు ఇచ్చారో వారి వివరాలను యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసిన తర్వాత ఎజారి అద్దె ఒప్పందం లో వారి వివరాలు అప్ డేట్ అవుతాయి. ఈ రిజిస్ట్రేషన్ ను చాలా సులభంగా చేసుకోవచ్చు.

నమోదు ఇలా:

దుబాయ్ REST మొబైల్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి, పేరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.

కొత్త వినియోగదారులైతే ముందుగా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్‌లో నమోదు చేసుకోవాలి.

మీరు ఇండివిజ్యువల్ అయితే "ఇండివిజ్యువల్" అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత యాక్సెస్ కోసం UAE పాస్‌తో లాగిన్ చేయాలి.

UAE పాస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు అప్ డేట్ చేసుకోవాలి

డాష్‌బోర్డ్ కు వెళ్లి మీరు అద్దె దారుగా ఉన్న ఆప్షన్ ను ఎంచుకోవాలి

కొనసాగించేందుకు సహ-నివాసుల ఆప్షన్ ఎంచుకోవాలి

మీరు అద్దెదారుగా ఉన్న ఆస్తికి సహ-నివాసుల పేరును యాడ్ చేయటానికి "యాడ్ మోర్" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

సహ నివాసి యొక్క ఎమిరేట్స్ ID నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, "వెరిఫై" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఆ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న వారందరీ పేర్లు యాడ్ చేయాలి.

ఎవరైనా సహ-నివాసి పేరు తీసేయాలంటే, రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com