భారత రాయబారితో బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కార్యదర్శి మీటింగ్
- September 26, 2022
మనామా : బహ్రెయిన్ లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో బహ్రెయిన్ పాస్ పోర్ట్, రెసిడెన్సీ, ఇంటీరియర్ వ్యవహారాల శాఖ కార్యదర్శి షేక్ హేషమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలను చర్చించారు. రెండు దేశాలు మరింత మెరుగైన సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ లో భారతీయుల సమస్యలు, పాస్ పోర్ట్ అంశాలు, రెసిడెన్షియల్ వ్యవహారాలను భారత రాయబారి ప్రస్తావించారు. ఈ అంశంలో మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. భారత్ తో సంబంధాల విషయంలో అత్యంత ప్రాధాన్యమిస్తున్న బహ్రెయిన్ ప్రయత్నాలకు ఆ దేశానికి అభినందనలు తెలుపుతున్నట్లు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







