త్వరలో యూఏఈ ఫార్మసీల్లో కొవిడ్-19, ఇన్ ప్లూయెంజా వ్యాక్సిన్లు
- September 26, 2022
యూఏఈ: త్వరలో యూఏఈలోని ఫార్మసీలలో కొవిడ్-19, ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. దేశ ఆరోగ్య అధికారులు నిర్దేశించిన కొన్ని మార్గదర్శకాలకు కట్టుబడి మాత్రమే ఫార్మసీల్లో వ్యాక్సిన్లకు అనుమతించినట్లు పబ్లిక్ హెల్త్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ రాండ్ తెలిపారు. బిజీగా ఉండే పౌరులు, నివాసితులకు ఈ కొత్త సౌకర్యంతో ప్రయోజనం ఉంటుందన్నారు. తమ సమీపంలోని ఫార్మసీకి వెళ్లి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తీసుకోవచ్చని, ఆయా ఫార్మసీ ప్రకారం ఛార్జీలు ఉంటాయన్నారు. ఇప్పటికే అబుధాబిలో ఈ సర్వీస్ ప్రారంభమైందని, దుబాయ్, ఉత్తర ఎమిరేట్స్‌లో త్వరలో ప్రారంభమవుతుందన్నారు. ఒకే రోజు కొవిడ్, ఫ్లూ (వ్యాక్సిన్) లను తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల సూచించిందని అల్ రాండ్ తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







