ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా సౌదీ
- September 26, 2022
సౌదీ: ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రాంతాలలో సౌదీ అరేబియా ఒకటిగా అవతరిస్తుందని పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ అన్నారు. రికార్డు స్థాయిలో గతేడాది మొత్తం 65 మిలియన్ల దేశీయ పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారని తెలిపారు. ఇది 80 బిలియన్ డాలర్ల ఖర్చుకు సమానమన్నారు. ఆదివారం నిర్వహించిన "సౌదీ నగరాలపై విజన్ 2030 ఇనిషియేటివ్స్ ఎఫెక్ట్" అనే డైలాగ్ సెషన్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. సౌదీ అరేబియాలో పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పర్యాటక మంత్రిత్వ శాఖ 1,700 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎర్ర సముద్రం ప్రాజెక్ట్‌తో సహా పర్యాటక ప్రదేశాలను సరైన రీతిలో ఉపయోగించుకునేందుకు సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాజ్యంలో పర్యాటక అభివృద్ధికి పలు వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించినట్లు పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వివరించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







