ప్రారంభానికి సిద్ధంగా కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్
- September 26, 2022
కువైట్: మిష్రెఫ్‌లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ ను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించనున్నారు. సరికొత్త డిజైన్లు, ఆధునిక టెక్నాలజీతో ఫెయిర్ గ్రౌండ్ లోని ప్రధాన హాల్స్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు నిర్వహణ కంపెనీ తెలిపింది. ప్రధాన హాళ్లలో పెర్ఫ్యూమ్, వాచీలు, బుక్, బిల్డింగ్ మెటీరియల్, గోల్డ్ ఎగ్జిబిషన్లు వంటివి సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లుగా మిష్రేఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్లు నిలిపివేశారు. ఆ సమయంలో ఎగ్జిబిషన్ హాళ్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ కేంద్రాలుగా ఉపయోగించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్‌కు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







