పార్కింగ్ ఇన్స్పెక్టర్ల కోసం కొత్త యాప్
- April 18, 2016
రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) కొత్త స్మార్ట్ ఫోన్ యాప్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్, పార్కింగ్ ఇన్స్పెక్టర్లకు ఉపయోగపడేలా రూపొందించారు. ఈ యాప్ ద్వారా దుబాయ్ ఎమిరేట్‌లో పార్కింగ్ ఇన్స్పెక్టర్లకు సమయం వృధా అవడంతోపాటు, మెరుగైన సౌకర్యాలను అందించడానికి వీలవుతుంది. కొత్త పర్మిట్లు ఇవ్వడం, పాత పర్మిట్లను రెన్యూవల్ చేయడం, పేవ్మెంట్స్ ఆక్యుపేషన్, ప్రైవేట్ ల్యాండ్ ప్లాట్లను పార్కింగ్ ఏరియాస్గా మార్చడం, సిటిజన్ల కోసం ప్రైవేట్ పార్కింగ్ పర్మింట్స్ ఇలాంటి సౌకర్యాలను ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంచారు. దుబాయ్ స్మార్ట్ గవర్నమెంట్లో భాగంగా అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ దుబాయ్ వాసులకు మెరుగైన సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఆర్టీఏ తీసుకుంటన్న చర్యల్లో ఈ స్మార్ట్ యాప్ కూడా ఒకటి అని ఆర్టిఏ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్ అదాయ్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







