ఫ్రీ బ్యాగేజ్‌ని పెంచిన కువైట్ ఎయిర్ వేస్
- April 18, 2016
కువైట్ ఎయిర్ వేస్ ఇండియన్ డెస్టినేషన్స్‌కి వెళ్ళే ప్రయాణీకులకు ఫ్రీ బ్యాగేజ్ సౌకర్యాన్ని పెంచింది. మస్కట్ నుంచి అహ్మదాబాద్, కొచ్చిన్, ఢిల్లీ, ముంబై, కొలంబో మరియు మనీలాకు వెళ్ళే ప్రయాణీకులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఒక్కో ్పయాణీకుడికీ ఒక్కోటీ 23 కేజీల బరువైన రెండు బ్యాగేజ్‌లను ఉచితంగా అనుమతిస్తారు. జూన్ 30 వరకు వర్తిస్తుంది ఈ ఆఫర్. 'బ్యాగేజ్ మేడ్ సింపుల్' పేరుతో ఇటీవలే కువైట్ ఎయిర్వేస్ బ్యాగేజీ పాలసీని ప్రకటించింది. కొన్ని సెలక్ట్ చేసిన డెస్టినేషన్లకు ఒక్కోటీ 23 కేజీలు గల రెండు బ్యాగేజీలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. లిస్ట్‌లో పేర్కొనని డెస్టినేషన్లకు వెళ్ళే ్పయాణీకులు మాత్రం 23 కిలోల బరువు గల ఒక్క బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్ళడానికి వీలుంది. అదనంగా తీసుకెళ్ళే బ్యాగేజీకి ఛార్జ్ చేయబడుతుంది. మస్కట్ నుంచి అహ్మదాబాద్, ఢిల్లీ మరియు ముంబైకి తదితర డెస్టినేషన్లకు టిక్కెట్ల ధరల్లో బంపర్ ఆఫర్‌ని కూడా కువైట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. కొలంబో, కొచ్చిన్ తదితర నగరాలూ ఈ ఆఫర్ డెస్టినేషన్లలో ఉన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







