వర్క్ వీసాకు 20 వృత్తుల్లో నైపుణ్య పరీక్షలు
- October 02, 2022
కువైట్: స్కిల్డ్ లేబర్ ప్రాజెక్టులో భాగంగా వర్క్ వీసా పొందేందుకు 20 వృత్తుల్లో నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డెవలప్మెంట్ తెలిపింది. ప్రవాస కార్మికులను నియమించే వృత్తుల్లో నైపుణ్య పరీక్షలు ఆయా దేశాల్లోని కువైట్ రాయబార కార్యాలయాల సహకారంతో జరుగుతాయన్నారు. కువైట్‌కు చేరుకున్న తర్వాత కార్మికుడు వర్క్ పర్మిట్‌కు అర్హత పొందే ముందు ప్రాక్టికల్ పరీక్షకు హాజరుకావలసి ఉంటుందని అథారిటీ పేర్కొంది. లేబర్ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న 20 వృత్తులను గుర్తించామని, రాబోయే రోజుల్లో మరిన్ని వృత్తులకు విస్తరిస్తామని తెలిపింది. ఒకవేళ కార్మికుడు ప్రాక్టికల్ పరీక్షలలో విఫలమైతే, స్పాన్సర్ బయలుదేరే సమయానికి తిరిగి వచ్చే ఛార్జీని చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







