ఎక్స్పో సిటీ దుబాయ్.. పెద్దసంఖ్యలో సందర్శకులు హాజరు
- October 02, 2022
యూఏఈ: ఎక్స్పో సిటీ దుబాయ్ అధికారిక ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. మొదటగా సుమారు 50 మంది ఎక్స్పో సిటీ దుబాయ్ సిబ్బంది, వారి కుటుంబాలు ఉదయం 9 గంటలకు సస్టైనబిలిటీ ఎంట్రీ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సాయంత్రం Al Wasl స్పెల్‌బైండింగ్ లైట్ షోతో సందర్శకులను ఆకట్టుకున్నది. విజన్ పెవిలియన్, ఉమెన్స్ పెవిలియన్ సెప్టెంబరులో ప్రారంభమైన అలీఫ్ - ది మొబిలిటీ పెవిలియన్, టెర్రా - ది సస్టైనబిలిటీ పెవిలియన్ లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. స్కై అబ్జర్వేషన్ టవర్‌లోకి వెళ్లేందుకు సందర్శకులు ఆసక్తి కనబరిచారు. ఎక్స్పో సిటీ దుబాయ్ లో Dhs120 వన్-డే అట్రాక్షన్స్ పాస్ విజన్ పెవిలియన్, ఉమెన్స్ పెవిలియన్స్, అలీఫ్, టెర్రాలకు ప్రవేశం కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎక్స్పో తెరిచిఉంటుంది. సందర్శకులు పెవిలియన్‌కు ఒక్కొక్కరికి Dhs50 చొప్పున వ్యక్తిగత పెవిలియన్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. 12 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. టిక్కెట్లను www.expocitydubai.comలో లేదా ఎక్స్పో సిటీ దుబాయ్‌లోని టిక్కెట్ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







