నేడే రమదాన్ చంద్ర దర్శనం
- June 16, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఈ.) ఇంకా ఇతర అరబ్ దేశాలు దృష్టి అంతా కేంద్రీకరించి నేడు రమదాన్ చంద్రదర్శనానికై నిరీక్షిస్తున్నై! ఇందుకోసం యు.ఎ.ఈ. యొక్క మూన్ సైటింగ్ కమిటీ, ఇంకా సౌదీ అరేబియా యొక్క సుప్రీం జూడిషియారీ కౌన్సిల్, వారి వారి దేశాలలో సమావేశం కానున్నాయి.
మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకి వెళ్ళిన చాంద్రమాన సంవత్సరంలో ప్రారంభమైన హిజ్రీ కేలండరును పాటించే అనేక పశ్చిమాది ముస్లిం దేశాలు కూడా రమదాన్ ప్రారంభ ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
యు.ఎ.ఈ., సౌదీ అరేబియా రెండు దేశాలలోని కమిటీలు నేడు మగ్రీబ్ ప్రార్ధన అనంతరం సమావేశమౌతాయి. ఆయా దేశాల వివిధ ప్రాంతాలలో చంద్ర దర్శనాన్ని గురించిన నిర్ధారణ అనంతరం, ఇషా ప్రార్ధన తరువాత ఇంచుమించు 9 గం. లకు రమదాన్ చంద్రదర్శనం ప్రకటించబడుతుంది.
నేడు చంద్రదర్శనం కాకుంటే, రమదాన్ గురువారం ప్రకటించబడుతుంది.
యు.ఎ.ఈ. లో ప్రజలు రమదాన్ ప్రార్ధనలలో మరింత సమయం గడపడానికి వీలుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిగంటలు తగ్గించబడ్డాయి. ఈ సంవత్సరం ప్రైవేటు రంగ ఉద్యోగుల పని గంటలు రెండు గంటలు తగ్గించబడ్డాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







