వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు

- June 16, 2015 , by Maagulf
వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు

 

వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగంలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గల్ఫ్, యు ఏ ఈ, కువైట్ ఎన్నారై కమిటీలలో ఈ నియామకాలు జరిగాయి. గల్ఫ్ కౌన్సిల్ లీడర్షిప్ టీం కన్వీనర్ గా బి.హెచ్.ఇలియాస్ (కువైట్)ను, కువైట్ విభాగం ఎన్నారై కమిటీ కన్వీనర్ గా ఎం.బాలిరెడ్డి నియమితులయ్యారు. ఆయా దేశాల ప్రతినిధులుగా షేక్ ఫయాజ్ (కువైట్), మంత్రాల న్యామతుల్లా (సౌదీ అరేబియా), నానార్ వలీ సయ్యద్, జి.విజయ భాస్కర్ రెడ్డి (యుఏయీ), ఆనంద్ ఈద, మందల వర్జిల్ బాబు (ఖతార్), కుంతం దేవేందర్  (బహ్రెయిన్), షేక్ అల్లావుద్దీన్ (ఎమెన్) నియుక్తులుయ్యారు. వీరు కాకుండా గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా  జీఎస్ఎస్ యెన్ రెడ్డి నియమితులయ్యారు.

 

                                    --వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com