అబుధాబీలో ట్రాఫిక్ నిబంధనలు మరింత క్రమబద్ధం

- June 16, 2015 , by Maagulf
అబుధాబీలో ట్రాఫిక్ నిబంధనలు మరింత  క్రమబద్ధం

రమదాన్ పవిత్ర మాసంలో అంతర్గత, బహిర్గత రోడ్లలో ట్రాఫిక్ నియంత్రణను మరింత  క్రమబద్ధం చేయనున్నట్టు, అందుకు ఒక వ్యూహాత్మక ప్రణాళికను రూపొoదించినట్టు Traffic and Patrol Investigation Section యొక్క acting head లెఫ్టనెంట్ కల్నల్ హమీద్ బిన్ అతీలహ్ అల్ షామేసి వెల్లడించారు.
   తరావీః ప్రార్ధనల సందర్భంగా అస్తవ్యస్త ట్రాఫిక్ను, జాంలను నిరోధించడానికి, ఆక్సిడెంట్లను, ప్రమాదాలను ఆపడానికి సిటీ పరిధిలోనూన్న మార్కెట్లు, వాణిజ్య స్థలాలు, మసీదులవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
    Lt. Colonal అల్ షామేసి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం చాలా ముఖ్యమని, సీట్ బెల్టును  ధరించాలని, వేగాన్నీ తగ్గించాలని, డ్రైవింగ్లో మొబైల్ ఫోన్లను వినియోగించరాదని, పవిత్ర మాసం సందర్భంగా డ్రైవర్లు, పాదచారులు కూడా పరస్పరం సహకరించుకోవాలని, ఇఫ్తార్ సమయంలో జన సంచారం బాగా పెరిగే సంగతి దృష్టిలో ఉంచుకుని మోటర్ వాహన డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
ప్రజలకు, కొత్త వారికి కూడా  ఈ విషయమై అవగాహన కలిగించడానికి, ప్రమాదాలను నివారించడానికి తగిన సమాచారంతో కూడిన బ్రోచర్లను డైరక్టరేటువారు పంపిణీ చేస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com